Telangana: తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాల్లోని అన్ని పోస్టర్లు, కటౌట్లు తొలగించాలి: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్

  • ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది
  • ప్రభుత్వ స్థలాల్లో ప్రకటనలు ఉండకూడదు
  • ప్రైవేట్ స్థలాల్లో బ్యానర్ల ఏర్పాటుకు యజమానుల అనుమతి తప్పనిసరి

తెలంగాణలో ఎన్నికల నియమావళిపై ఎన్నికల కమిషన్ స్పష్టత నిచ్చిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ లోని సచివాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిందని చెప్పారు.

నిబంధనల ఉల్లంఘన కిందకు వచ్చే అంశాలేంటో ఈసీ స్పష్టం చేసిందని చెప్పారు. ప్రభుత్వ స్థలాల్లో ప్రకటనలు ఉండకూడదని, ప్రభుత్వ భవనాలపై ఉన్న అన్ని పోస్టర్లు, కటౌట్లు తొలగించాలని, ఇరవై నాలుగు గంటల్లోగా రైల్వేస్టేషన్, బస్ స్టేషన్, విమానాశ్రయాల్లో ఉన్న బ్యానర్లన్నీ తొలగించాలని ఆదేశించారు. ప్రైవేట్ స్థలాల్లో యజమాని అనుమతితోనే ప్రచార బ్యానర్లు, వాల్ పోస్టర్లు వంటివి ఏర్పాటు చేయాలని, వారి అనుమతి లేకుంటే 72 గంటల్లోగా తొలగించాలని ఆదేశించారు.

More Telugu News