Maneru Dam: మానేరు డ్యామ్ లో బోటెక్కబోయి కాలుజారిన గంగుల కమలాకర్.. తృటిలో తప్పిన ప్రమాదం!

  • మానేరు డ్యామ్ లో బోటింగ్ కు వెళ్లిన గంగుల
  • కాలుజారి నీటిలో పడ్డ టీఆర్ఎస్ నేత
  • బయటకు తీసిన సిబ్బంది

తెలంగాణ రాష్ట్ర సమితి నేత గంగుల కమలాకర్, ఈ ఉదయం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నేడు ఆయన మానేరు డ్యామ్ లో బోట్ ఎక్కబోతున్న క్రమంలో కాలుజారి నీటిలో పడిపోయారు. అలా రెండు సార్లు జరిగింది. ఆ పక్కనే ఉన్న సిబ్బంది ఆయన్ను బయటకు తీశారు.

వాస్తవానికి నాలుగు రోజుల క్రితం మానేరు డ్యామ్ లో గంగుల బోటింగ్ ను ప్రారంభించాల్సి వుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో, అధికారులే ఆ పని ముగించారు. రెండు స్పీడ్ బోట్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ ఉదయం ఎన్నికల ప్రచారంలో ఉన్న గంగుల, సరదాగా కాసేపు బోటింగ్ చేయాలని భావించారు. ఆ క్రమంలోనే కాలుజారి డ్యామ్ లో పడిపోయారు. అయితే, లైఫ్ జాకెట్ ను ఆయన ధరించి వుండటంతో ఎటువంటి ప్రమాదమూ జరగలేదు. గంగుల సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News