kcr: కాంగ్రెస్ నాయకులు కత్తులు తిప్పాల్సిన చోట తిప్పలేదు: సీఎం కేసీఆర్ సెటైర్

  • బాగోతంలో బుడ్డెరఖాన్ లు కత్తులు తిప్పినట్టు తిప్పారు
  • కాంగ్రెస్, టీడీపీ పార్టీల పాలనలో తెలంగాణ ఎలా ఉంది?
  • టీఆర్ఎస్ పాలనలో ఎలా ఉంది? 
నిన్న జరిగిన గద్వాల సభలో కాంగ్రెస్ నాయకులు కత్తులు తిప్పడంపై సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. వనపర్తిలో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, బాగోతంలో బుడ్డెరఖాన్ లు కత్తులు తిప్పినట్టు తిప్పారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ నాయకులు కత్తులు తిప్పాల్సిన చోట తిప్పలేదని విమర్శించారు. ఎలక్షన్ల సమయంలో తియ్యగా, పుల్లగా మాట్లాడి మోచేతికి బెల్లంపెట్టి నాకించారని  అన్నారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీల పాలనలో తెలంగాణ ఎలా ఉంది? టీఆర్ఎస్ పాలనలో ఎలా ఉంది? అని ప్రజలను ప్రశ్నించారు. కాంగ్రెస్ సభకు తమ సభలో పల్లీబఠానీలు అమ్ముకున్నంత మంది కూడా రాలేదని విమర్శించారు. 
kcr
Wanaparthy District

More Telugu News