murugadoss: ఆర్టిస్టులకు మురుగదాస్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చేశాడు!

  • విడుదలకి ముస్తాబవుతోన్న 'సర్కార్' 
  • ఈ సినిమాను గురించి మాట్లాడవద్దు 
  • నా అనుమతి లేకుండా ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు        

విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన 'సర్కార్ ' విడుదలకి ముస్తాబవుతోంది. పోస్టర్స్ ను వదిలిన దగ్గర నుంచే అందరి దృష్టి ఈ సినిమా వైపుకు మళ్లింది. గతంలో మురుగదాస్ .. విజయ్ కాంబినేషన్లో వచ్చిన 'కత్తి' .. 'తుపాకీ' చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలను సాధించడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నటించిన జూనియర్ ఆర్టిస్టులకు మురుగదాస్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చేశాడు.

'సర్కార్' సినిమాలో నటించిన జూనియర్ ఆర్టిస్టులు ఈ సినిమాను గురించి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. నా అనుమతి లేకుండా ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూలు ఎవరిచ్చినా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన ట్వీట్ చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన ఏ సన్నివేశం గురించి మాట్లాడినా కథ లీకై .. ఆడియన్స్ థ్రిల్ ను కోల్పోయే అవకాశం వుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే మురుగుదాస్ ఇలా వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News