Ayyanna Patrudu: మావోయిస్టులను చర్చలకు ఆహ్వానించిన మంత్రి అయ్యన్నపాత్రుడు!

  • సమస్యలుంటే మాట్లాడుకుందాం రండి
  • శాంతి భద్రతలకు భంగం వాటిల్లనీయొద్దు
  • ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు
మావోయిస్టులకు ఏమైనా సమస్యలు ఉంటే చర్చించి పరిష్కరించుకోవాలని, మావోలు చర్చలకు వస్తామంటే, ఎప్పుడైనా ప్రభుత్వం సిద్ధమేనని ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. వారిని చర్చలకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అరకులో మావోయిస్టుల చర్యలు సరికాదని అన్నారు.

మావోలు ఏవైనా ఘటనలకు పాల్పడితే, అందుకు తగ్గ కారణాలను తెలుపుతూ లేఖను విడుదల చేస్తారని, కానీ కిడారి హత్యోదంతం తరువాత వారు ఎటువంటి లేఖనూ విడుదల చేయలేదని గుర్తు చేశారు. సమస్యలకు పరిష్కారం చర్చల ద్వారా మాత్రమే లభిస్తుందని, ఇటువంటి ఘటనలకు పాల్పడి శాంతిభద్రతలకు భంగం వాటిల్లనీయవద్దని సూచించారు.
Ayyanna Patrudu
Maoists
Araku
Meeting
Tirumala

More Telugu News