Balakrishna: బాలయ్య కాళ్లకు మొక్కిన నిరుపేద వృద్ధుడు... అప్పటికప్పుడు సాయం ప్రకటించిన బాలకృష్ణ!

  • సాయం చేయాలంటూ అర్థించిన క్యాన్సర్ బాధితుడు
  • అప్పటికప్పుడే బసవతారకం ఆసుపత్రికి ఫోన్ చేసిన బాలయ్య
  • ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలంటూ ఆదేశం
హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయనకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే, హంసల దీవిలో 'ఎన్టీఆర్' బయోపిక్ షూటింగ్ లో బాలయ్య బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా షూటింగ్ లొకేషన్లో ఓ నిరుపేద వృద్ధుడు బాలయ్య వద్దకు వచ్చాడు. తాను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నానని... తనకు సాయం చేయాలని అర్థించాడు.

ఆయన పరిస్థితి చూసి చలించిపోయిన బాలయ్య... అప్పటికప్పుడే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఫోన్ చేశారు. ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాలయ్య చేసిన సాయానికి ఆ వృద్ధుడు సంతోషంతో కంటతడి పెట్టాడు. కాళ్లకు మొక్కి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Balakrishna
old man
foot
basavatarakam
cancer hospital

More Telugu News