mammootty: 'యాత్ర'లో జగన్ పాత్రపై ఫిల్మ్ నగర్ టాక్

  • తెలుగులో బయోపిక్ ల జోరు 
  • షూటింగు దశలో 'యాత్ర'
  • వైఎస్ పాత్రలో మమ్ముట్టి

తెలుగులో ప్రస్తుతం బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా 'యాత్ర' రూపొందుతోంది. మహి.వి రాఘవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. సైలెంట్ గా .. నాన్ స్టాప్ గా ఈ సినిమా షూటింగును కానిచ్చేస్తున్నారు. ఈ సినిమాలో జగన్ పాత్ర కోసం సూర్యను గానీ .. కార్తీని గాని తీసుకోవచ్చనే టాక్ ఆ మధ్య వినిపించింది.

కానీ ఇప్పుడు ఈ సినిమాలో జగన్ పాత్ర కనిపించదని ఫిల్మ్ నగర్ టాక్. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర .. ఆయన ముఖ్యమంత్రిగా గద్దెనెక్కడం వరకూ ఈ కథ కొనసాగుతుందట. జగన్ పాత్ర వుంటే ఆ పాత్రకి కూడా ప్రాధాన్యతనిస్తూ వెళ్లవలసి ఉంటుంది. దాంతో రాజశేఖర్ రెడ్డి పాత్రపై ఫోకస్ తగ్గుతుందనేది దర్శకనిర్మాతల అభిప్రాయం. ప్రేక్షకులంతా రాజశేఖర్ రెడ్డి పాత్రతోనే కొనసాగాలనే ఉద్దేశంతోనే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.    

  • Loading...

More Telugu News