Pamarru: సోషల్ మీడియాలో టీడీపీ మహిళా ఎమ్మెల్యేపై అసభ్య ప్రచారం!

  • పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనపై అభ్యంతరక వ్యాఖ్యలు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్యే
  • కేసు నమోదు, యువకుడి అరెస్ట్
సామాజిక మాధ్యమాల ద్వారా తెలుగుదేశం పార్టీ పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన టార్గెట్ గా పోస్ట్ అవుతున్న వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కల్పన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పామర్రు ఎస్ఐ పి.రాంబాబు వెల్లడించిన వివరాల మేరకు, గోరిపర్తి నాగబాబు యాదవ్ అనే వ్యక్తి ఎమ్మెల్యేను ఉద్దేశించి, అసభ్య వ్యాఖ్యలను పోస్టు చేశాడు. "నువ్వు చీరలు మార్చినంత సులువుగా పార్టీలు మారుస్తావు. రాజన్నకు తెలియక సాయం చేశారు", "ఫ్లాష్ న్యూస్... తప్పతాగి దొరికిపోయిన మహిళా ఎమ్మెల్యే ఎవరో తెలియాలంటే పామర్రు వచ్చేయండి",

"ఇక్కడో ఆడ ఊసరవెల్లి రంగు మార్చింది", "మన పామర్రులో మావోలు లేరుగా... అవినీతి ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండండి. అరకు దాకా వచ్చిన మావోలు అమరావతికి రాకపోవడం ఏంటి? చాలా దారుణం. ఓపాలొచ్చి పోవచ్చుగా" అంటూ పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. ఎమ్మెల్యే కల్పన ఫిర్యాదు మేరకు నాగబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, నాగబాబును అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అతన్ని డీఎస్పీ పి మహేష్ స్వయంగా విచారిస్తారని అన్నారు.
Pamarru
Uppuleti Kalpana
Social Media
Police
Arrest

More Telugu News