Talak: ఫలితమివ్వని ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్... ఫోన్ ద్వారా భార్యకు తలాక్ చెప్పిన భర్త!

  • పెళ్లయిన కొన్ని నెలల నుంచే వేధింపులు మొదలు
  • సౌదీ నుంచి ఫోన్‌లో తలాక్ చెప్పిన భర్త
  • చర్యలు తీసుకోవాలన్న బాధితురాలు

కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి వారాలైనా గడవకముందే ఓ వ్యక్తి తన భార్యకు ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి తల్లి రేష్మా కథనం ప్రకారం.. అదనపు కట్నం కోసం తన కుమార్తెను అత్తమామలు వేధిస్తున్నారని ఆరోపించింది. సౌదీలో ఉండే తన అల్లుడితో ట్రిపుల్ తలాక్ చెప్పించారని పేర్కొంది.

అత్తింటివారు తన కుమార్తెను వేధిస్తుండడంతో ఇంటికి తీసుకొచ్చేశానని, దీంతో అదనపు కట్నం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారని రేష్మా పేర్కొంది. డబ్బులు తీసుకురాకుంటే తలాక్ చెబుతామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసింది. అనుకున్నట్టే అల్లుడు సౌదీ నుంచి తన కుమార్తెకు ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పాడని వాపోయింది. తన కుమార్తెను వేధించిన అత్తింటివారితోపాటు తలాక్ చెప్పిన అల్లుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.

తనకు 8 నెలల క్రితమే పెళ్లయిందని బాధితురాలు నూర్ తెలిపింది. మోటారు సైకిలు తీసుకురావాలని, రూ.50 వేల అదనపు కట్నం తీసుకురావాలని తనను కొడుతూ వేధిస్తున్నారని ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News