KCR: ఆనాడు కాళ్లు పట్టుకున్నది మాతో కాదా?: కేసీఆర్ పై ఎల్.రమణ విమర్శలు

  • హుస్నాబాద్ సభ తరువాత 25 రోజులు అజ్ఞాతంలోకి
  • ఇప్పుడు బయటకు వచ్చి అనుచిత విమర్శలా
  • 2009లో కాంగ్రెస్ తో, 2014లో టీడీపీతో పొత్తులు పెట్టుకోలేదా?
  • కేసీఆర్ క్షమాపణలు చెప్పాలన్న ఎల్ రమణ

హుస్నాబాద్ లో ఎన్నికల సభను నిర్వహించిన తరువాత, 25 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి తిరిగొచ్చి, తమను టార్గెట్ గా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని తెలంగాణ రాష్ట తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్ రమణ డిమాండ్ చేశారు. 2004లో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తో, 2009లో తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకున్న ఆయన, నాడు సీట్ల కోసం తమ పార్టీ నేతల కాళ్లు పట్టుకున్న సంగతిని మరిచారని నిప్పులు చెరిగారు.

మతిభ్రమించిన కేసీఆర్, అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని చెబుతూ, 2009లో ఎన్నికలు జరిగిన వేళ, ఆయన మాట్లాడిన మాటలను వినిపించారు. సంపదను ఎలా సృష్టించాలో చంద్రబాబుకు తెలుసునని నాడు స్వయంగా వ్యాఖ్యానించిన ఆయన, ఇప్పుడు అడ్డగోలుగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. ఉద్యమ సమయంలో మాట్లాడినట్టుగా ఇప్పుడు మాట్లాడితే చెల్లబోదని, దొంగ పాస్ పోర్టులు తయారు చేయించిన దొంగ బతుకు ఆయనదని అన్నారు.

  • Loading...

More Telugu News