selfie deaths: సెల్ఫీ మరణాల్లో అత్యధిక శాతం భారత్‌లోనే... నివేదికలో వెల్లడి!

  • నివేదిక విడుదల చేసిన ఏఐఐఎంఎస్
  • ప్రాణాలు కోల్పోతున్నా మోజు తగ్గట్లేదు
  • సెల్ఫీల కారణంగా 250 మందికి పైనే మృతి

సెల్ఫీ మరణాల్లో అత్యధిక శాతం భారత్‌లోనే చోటుచేసుకుంటున్నాయట. సెల్ఫీల కారణంగా జరుగుతున్న అనర్థాలను వివరిస్తూ ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఐఐఎంఎస్) నివేదిక విడుదల చేసింది. సెల్ఫీల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నా.. మోజు మాత్రం వీడటం లేదు. అది రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అక్టోబరు 2011 నుంచి నవంబరు 2017 వరకు సెల్ఫీల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 250 పైనేనని తేలింది. వారిలో అత్యధికులు (72 శాతం) పురుషులే కావడం, అందులోనూ 30 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం.

More Telugu News