Congress: మధ్యప్రదేశ్ లో అఖిలేష్‌తో పొత్తుకు పావులు కదుపుతున్న కాంగ్రెస్

  • ఒంటరి పోరుకు సిద్ధమని తేల్చిన మాయావతి
  • గెలవని స్థానాలను కోరినందునే పొత్తుకు విఘాతం
  • కాంగ్రెస్‌కు క్షేత్ర స్థాయిలో ఆదరణ

కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇస్తూ మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమని మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. దీంతో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీతో పొత్తుకు పావులు కదుపుతోంది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమలనాథ్ స్వయంగా ధ్రువీకరించారు.

బీఎస్పీ ఒంటరి పోరు చేయడం వలన మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌కు మంచి ఆదరణ కనిపిస్తోందని కమలనాథ్ చెప్పారు. బీఎస్పీ తమకు అందించిన సీట్ల జాబితాలో ఆ పార్టీ గెలిచే స్ధానాలు లేవని, గెలవని స్ధానాలను కోరడంతోనే బీఎస్పీతో పొత్తు ప్రయత్నాలకు విఘాతం కలిగిందని కమల్‌ నాథ్ చెప్పారు. కాగా, కొన్ని రోజుల కిందట అఖిలేష్‌తో పొత్తుకు సంబంధించి తాను మాట్లాడనని, దీనిపై సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

More Telugu News