ayyappa swamy: ‘శబరిమల’ తీర్పును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత నిరాహారదీక్ష

  • పిటీషన్ వేసేది లేదన్న కేరళ ప్రభుత్వం
  • రివ్యూ పిటీషన్ వేయాలంటున్న కాంగ్రెస్
  • ట్రావెన్‌కోర్ మాజీలతో సమావేశం

ప్రముఖ పుణ్య క్షేత్రం శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మిశ్రమ స్పందన వస్తోంది. ఈ తీర్పుపై కొందరి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఓవైపు ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా పిటీషన్ వేసే యోచనేదీ లేదని కేరళ ప్రభుత్వం స్పష్టం చేస్తుంటే... మరోవైపు సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ రివ్యూ పిటీషన్ వేయాలని యోచిస్తోంది. మరోపక్క, శబరిమలకు వచ్చే మహిళల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై కేరళ ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత రమేశ్ చెన్నితాల శుక్రవారం సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయనున్నారు. ఈ మేరకు దీనిపై ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షులు, మాజీలతో నేటి సాయంత్రం సమావేశం జరిగింది.

  • Loading...

More Telugu News