Rahul Gandhi: ఇది పడిపోవడం కాదు.. చితికి పోవడం: రాహుల్

  • రూపాయి విలువ చితికిపోయింది
  • ప్రధాని మోదీ నోరు కూడా మెదపడం లేదు
  • రూపాయి పతనంతో మార్కెట్లు కుప్పకూలుతున్నాయి

అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ దారుణంగా పతనం కావడంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. రూపాయి విలువ 73.77కు పతనమయిందని... ఇది పడిపోవడం కాదని, చితికిపోవడమని అన్నారు. భారత కరెన్సీ చితికిపోయిందని చెప్పారు. రూపాయి విలువ పాతాళానికి పడిపోయినా ప్రధాని మోదీ నోరు మెదపడం లేదని అన్నారు. ఇంధన, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా మోదీ మౌనం వీడటం లేదని విమర్శించారు. రూపాయి పతనంతో స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలుతున్నాయని చెప్పారు.

More Telugu News