Akhil: అఖిల్ సరసన వాణిజ్య ప్రకటనలో ప్రియా వారియర్.. వీడియో ఇదిగో!

  • కన్నుగొట్టి, గిలిగింతలు పెట్టిన ప్రియా వారియర్
  • అఖిల్ తో కలసి ఓ వ్యాపార ప్రకటనలో మలయాళ భామ
  • ఇద్దరి జోడీ బాగుందంటున్న నెటిజన్లు
అక్కినేని నట వారసుడు అఖిల్ తో కన్నుగొట్టి, గిలిగింతలు పెట్టిన భామ ప్రియా వారియర్ నటించిన వీడియో ఇది. అదేంటి అఖిల్, ప్రియా వారియర్ ఏ సినిమాలో నటించారని అనుకుంటున్నారా? సినిమా కాదులెండి. సౌతిండియా షాపింగ్ మాల్ కోసం తీసిన ఓ వ్యాపార ప్రకటనలో వీరిద్దరూ కలసి నటించారు. ఇక వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూసిన వారంతా ఈ జోడీ బాగుందని కితాబిస్తున్నారు. కాగా, ప్రస్తుతం అఖిల్ 'మజ్ను' చిత్రంతో బిజీగా ఉండగా, 'ఒరు ఆధార్ లవ్' తరువాత ప్రియా వారియర్ మరో చిత్రానికింకా సైన్ చేయలేదని తెలుస్తోంది. వీరిద్దరూ కలసి నటించిన యాడ్ ను మీరూ చూడండి.
Akhil
Priya Prakash Warriar
Advertisement
Acting

More Telugu News