India: ఓపెనర్ గా రానున్న యువ కెరటం పృధ్వీషాపైనే అందరి కళ్లూ... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్!

  • నేటి నుంచి రాజ్ కోట్ లో వెస్టిండీస్ తో మ్యాచ్
  • కేఎల్ రాహుల్ తో కలసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్న పృధ్వీ షా
  • వెస్టిండీస్ కు తొలిసారిగా బ్రాత్ వైట్ కెప్టెన్సీ

వెస్టిండీస్ తో రాజ్ కోట్ లో నేటి నుంచి ప్రారంభంకానున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో పలువురు సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టిన టీమిండియా, యువ ఆటగాళ్లకు అవకాశాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తో తొలిసారిగా పృధ్వీ షా టెస్టు అరంగేట్రం చేయనున్నాడు. ఓపెనర్ గా బరిలోకి దిగుతున్న పృధ్వీషా ఎలా ఆడతాడన్న విషయమై ప్రతి క్రికెట్ అభిమానీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడంటే అతిశయోక్తి కాదు. దేశవాళీ పోటీల్లో, గత ఐపీఎల్ సీజన్ లో రాణించిన పృధ్వీ షా, కేఎల్ రాహుల్ తో కలసి భారత బ్యాటింగ్ ను ప్రారంభించనున్నాడు. జేసన్ హోల్డర్ అందుబాటులో లేకపోవడంతో వెస్టిండీస్ కు బ్రాత్ వైట్ తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు.

జట్టు వివరాలు:
ఇండియా: కేఎల్ రాహుల్, పృధ్వీ షా, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ, కుల్ దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్.

వెస్టిండీస్ : క్రెయిగ్ బ్రాత్ వైట్ (కెప్టెన్), కిరన్ పావెల్, షాయి హోప్, సునీల్ అంబ్రిస్, షిమ్రాన్ హెట్ మేయర్, రోస్టన్ ఛేజ్, షేన్ డవ్రిక్ (వికెట్ కీపర్),  దేవేంద్ర బిషో, షనాన్ గాబ్రియేల్, లూయిస్.

More Telugu News