Geeta Krishnakant Uplenkar: దివికేగిన 'దీప సుందరి'!

  • 'ఉమెన్ విత్ ద ల్యాంప్' శీర్షికతో కనిపించే పెయింటింగ్
  • కుమార్తె గీతను అద్భుతంగా తీర్చిదిద్దిన చిత్రకారుడు హల్దాంకర్
  • 102 ఏళ్ల వయసులో కన్నుమూసిన గీతా కృష్ణకాంత్ ఉప్లెంకర్

'ఉమెన్ విత్ ద ల్యాంప్'... గీతా కృష్ణకాంత్ ఉప్లెంకర్... ఈ పేర్లు చెబితే ఎవరికీ తెలియదుగానీ, మైసూర్ జగన్మోహన ప్యాలెస్ లోని జయ చామరాజేంద్ర కళా ప్రాంగణంలో ఉండే 'దీప సుందరి' అంటే మాత్రం కన్నడిగులు ఇట్టే గుర్తు పట్టేస్తారు. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ఈ ప్యాలెస్ లో 'ఉమెన్ విత్ ద ల్యాంప్' శీర్షికతో కనిపించే ఈ చిత్రం ఇట్టే ఆకర్షిస్తుంది.

దశాబ్దాల క్రితం విఖ్యాత చిత్ర కళాకారుడు ఎస్ఎల్ హల్దాంకర్, తన కుమార్తె గీత చిత్రాన్ని వాటర్ కలర్స్ లో ఇలా తీర్చిదిద్దారు. గీత 16 ఏళ్ల వయసులో ఉన్న వేళ, దీపం పట్టుకుని వస్తుండగా చూసిన హల్దాంకర్, వెంటనే ఆమెనిలా ఆవిష్కరించారు. గతంలో ఫ్రాన్స్ కు చెందిన ఓ వ్యక్తి ఈ పెయింటింగ్ ను రూ. 8 కోట్లకు కొనుగోలు చేస్తానని ఆఫర్ ఇచ్చినా ఇవ్వలేదు. మైసూర్ మహారాజుకు ఈ పెయింటింగ్ ను కేవలం రూ. 300కు హల్దాంకర్ అందించినట్టు ప్యాలెస్ నిర్వాహకులు తెలిపారు.

కాగా, 102 ఏళ్ల వయసులో గీతా కృష్ణకాంత్ ఉప్లెంకర్, మంగళవారం రాత్రి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఆమె మరణించారని కుటుంబీకులు తెలిపారు. ఆమె అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.

More Telugu News