Madhya Pradesh: సెల్ టవర్ ఎక్కిన ఆశా కార్యకర్త... నచ్చజెప్పేందుకు వెళ్లి కిందపడిపోయిన మహిళా కానిస్టేబుళ్లు!

  • డిమాండ్లు పరిష్కరించాలని భోపాల్ లో నిరసన
  • ఆశా వర్కర్ ను కాపాడేందుకు వెళ్లిన మహిళా పోలీసులు
  • 15 అడుగుల ఎత్తుపై నుంచి పడి తీవ్ర గాయాలు
తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆశావర్కర్లు నిరసన తెలుపుతున్న వేళ, ఓ యువతి సెల్ టవర్ ను ఎక్కగా ఊహించని పరిణామం ముగ్గురిని ఆసుపత్రిపాలు చేసింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆశావర్కర్లు తమ డిమాండ్ల సాధనకు గత రెండు రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఓ ఆశాకార్యకర్త సెల్ టవర్ ఎక్కింది.

ఆమెను కాపాడేందుకు కొందరు మహిళా కానిస్టేబుళ్లూ పైకి ఎక్కారు. ఆమెను ఒప్పించి కిందకు దించే క్రమంలో సదరు ఆశా కార్యకర్త పట్టుతప్పి కిందకు జారిపోగా, ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు దాదాపు 15 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డారు. దీంతో వారికి తీవ్ర గాయాలు కాగా, పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆశా వర్కర్ సెల్ టవర్ పై నుంచి పడిపోయిందని తెలుసుకున్న మిగతావారు, తీవ్ర ఆందోళనకు దిగగా, పోలీసులు వారిని చెదరగొట్టి, పలువురిని అరెస్ట్ చేశారు.
Madhya Pradesh
Bhopal
Aasa Workers
Cell Tower

More Telugu News