Haryana: తల్లీ కుమార్తెలపై రెండు నెలలుగా 18 మంది అత్యాచారం.. నిందితుల్లో ఏడుగురు పోలీసులు!

  • రెండు నెలలపాటు ఇద్దరిపైనా అత్యాచారం
  • నిందితుల్లో పోలీసులు, సర్పంచ్, మాజీ సర్పంచ్‌లు
  • పోక్సో చట్టం కింద కేసులు నమోదు
తల్లీ కుమార్తెలపై రెండు నెలలపాటు 18 మంది కలిసి అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన హరియాణాలో వెలుగు చూసింది. నిందితుల్లో ఏడుగురు పోలీసులు కూడా ఉండడం సంచలనం సృష్టిస్తోంది. బాధిత బాలిక ఫిర్యాదుతో దారుణం వెలుగులోకి వచ్చింది. మొత్తం 18 మందిపైనా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కైథాల్ కలాయత్ పట్టణం సమీపంలో ఈ  ఘటన జరిగినట్టు కౌథాల్ జిల్లా ఏసీపీ అస్తామోదీ తెలిపారు. నిందితుల్లో ఏడుగురు హరియాణా పోలీసులు, గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్‌లు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. ఏఎస్ఐ షంషేర్ సింగ్ తనతోపాటు తన తల్లిపైనా పలుమార్లు అత్యాచారం చేసినట్టు బాధిత బాలిక పోలీసులకు తెలిపింది.
Haryana
Gang Rape
Mother
Child
Police
Posco

More Telugu News