KCR: ఖమ్మం ఆశీర్వాద సభ వాయిదా... ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాతనే!

  • 8న ఖమ్మంలో జరగాల్సిన సభ
  • ఆపై రెండు మూడు రోజుల్లోనే నోటిఫికేషన్ వెలువడే చాన్స్
  • సభ వాయిదా వేసుకోవాలని కేసీఆర్ నుంచి సంకేతాలు
వచ్చే సోమవారం, 8వ తేదీన ఖమ్మంలో తెలంగాణ రాష్ట్ర సమితి తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభను వాయిదా వేస్తున్నట్టు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఖమ్మం, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సభను తలపెట్టగా, ఆపై రెండు మూడు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందన్న వార్తలతో సభను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది.

ఎన్నికల నోటిఫికేషన్ తరువాతే సభలు జరుగుతాయని, అది కూడా రెండు నియోజకవర్గాలకు కలిపి కాకుండా, విడివిడిగా నిర్వహిస్తామని, ఈ రెండు సమావేశాలకూ కేసీఆర్ హాజరవుతారని పార్టీ జిల్లా నేతలు వెల్లడించారు. తమ అధినేత కేసీఆర్ నుంచి అందిన సంకేతాల మేరకు, నోటిఫికేషన్ తరువాత సభలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
KCR
Khammam
Aashirvada Sabha
Postpone

More Telugu News