Anil Ambani: అనిల్ అంబానీ దేశం విడిచి పారిపోయే అవకాశం: సుప్రీంకోర్టులో ఎరిక్ సన్ పిటిషన్

  • ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో అడాగ్ గ్రూప్
  • మాకు రూ. 550 కోట్లు చెల్లించాలి
  • తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోతారేమో
  • ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకెక్కిన ఎరిక్ సన్

ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీ, అడాగ్ గ్రూప్ నకు చెందిన మరో ఇద్దరు ఉన్నతాధికారులు, ఇండియాను వదిలి పారిపోయే అవకాశాలు ఉన్నందున, వారు దేశం విడిచి వెళ్లకుండా చూడాలని, స్వీడన్ కు చెందిన టెలికం సంస్థ ఎరిక్ సన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమకు ఆయన రూ. 550 కోట్లను చెల్లించాల్సి వుందని, దాన్ని ఎగవేసి విదేశాలకు పారిపోతారన్న భయం తమకుందని చెప్పింది.

అంబానీ గ్రూప్ తమకు రూ. 1,600 కోట్లు చెల్లించాలని, ఇప్పటికే తాము రూ. 550 కోట్లకు దాన్ని తగ్గించుకున్నామని గుర్తు చేసిన ఎరిక్ సన్, ఈ మొత్తాన్ని సెప్టెంబర్ 30 నాటికి చెల్లిస్తామని హామీ ఇచ్చిన సంస్థ విఫలమైందని పేర్కొంది. తమకు చెల్లింపులు జరుగకపోవడంతోనే కోర్టును ఆశ్రయించామని, అనిల్ అంబానీపై చర్యలు తీసుకోవాలని వారు దేశ చట్టాలకు గౌరవం ఇచ్చే వ్యక్తి కాదని వ్యాఖ్యానించింది.

కాగా, ఇదే సమయంలో ఆర్ కామ్ తరఫున హాజరైన న్యాయవాది వాదనలు వినిపిస్తూ, తమకు బకాయిలు చెల్లించే విషయంలో మరో రెండు నెలల గడువు కావాలని సెప్టెంబర్ 28న పిటిషన్ దాఖలు చేసినట్టు గుర్తు చేసింది. ఎరిక్ సన్ తాజా పిటిషన్ అసమంజసమని తెలిపింది. కాగా, ఈ కేసులో విచారణ నేడు కూడా కొనసాగనుంది.

More Telugu News