cm kcr: ఇక్కడ స్థిరపడిన వారు ఆంధ్రావాళ్లమనే భావనను వదిలిపెట్టుకోవాలి!: సీఎం కేసీఆర్

  • ఆంధ్రా నుంచి వచ్చిన అన్నదమ్ములు ఇక్కడున్నారు
  • వాళ్లను ఆంధ్రావాళ్లుగా చూడటం లేదు
  • వాళ్లందరూ తెలంగాణబిడ్డలే
ఎన్నో ఏళ్ల కిందట ఆంధ్రా నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడిన వారందరూ తెలంగాణ బిడ్డలేనని సీఎం కేసీఆర్ అన్నారు. నిజామాబాద్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ, నిజామాబాద్ పట్టణంలోను, జిల్లాలోని బాన్స్ వాడ, బోధన్, డిచ్ పల్లి ప్రాంతాల్లోను డెబ్బై ఎనభై ఏళ్ల కిందట ఆంధ్రా నుంచి వచ్చి స్థిరపడిన అన్నదమ్ములున్నారని అన్నారు. ఎప్పుడో, అన్ని సంవత్సరాల కిందట వచ్చిన వాళ్లను ఆంధ్రావాళ్ల కింద చూడటం లేదని, వాళ్లు కూడా తెలంగాణ బిడ్డలేనని చెప్పారు. తెలంగాణలో ఎప్పటి నుంచో ఉన్న వాళ్లు ఆంధ్రావాళ్లు కాదని, ఆ భావనను వదిలిపెట్టుకోవాలని కేసీఆర్ సూచించారు.
cm kcr
Nizamabad District

More Telugu News