Pawan Kalyan: ప్రాణహాని ఉందని సాక్ష్యాధారాలను సమర్పిస్తే.. పవన్ కల్యాణ్ కు రక్షణ కల్పిస్తాం: ఎస్పీ

  • పవన్ కు ఇప్పటికే అదనపు భద్రతను కల్పిస్తున్నాం
  • మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగుతోంది
  • పోలవరం ప్రాజెక్టు ప్రాంతాల్లో పని చేస్తున్న వ్యక్తులపై నిఘా పెంచాం
తనకు ప్రాణహాని ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సాక్ష్యాధారాలను సమర్పిస్తే రక్షణ కల్పిస్తామని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. ఈరోజు ఆయన పెనుమంట్ర పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ కు ఇప్పటికే అదనపు భద్రతను కల్పిస్తున్నామని చెప్పారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగుతోందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాల్లో పని చేస్తున్న వ్యక్తులపై నిఘా పెంచామని తెలిపారు.
Pawan Kalyan
West Godavari District
sp
security

More Telugu News