vijay devarakonda: ఎన్టీఆర్ కి పోటీగా వస్తున్నాననడంలో అర్థం లేదు: విజయ్ దేవరకొండ
- ఎన్టీఆర్ పెద్ద హీరో
- 'అరవింద సమేత' పెద్ద సినిమా
- ఆయనతో నేను పోటీ పడటమేంటి?
ఎన్టీఆర్ హీరోగా రూపొందిన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా నిర్మితమైన 'నోటా' సినిమా ఈ నెల 5వ తేదీన విడుదలవుతోంది. ఈ విషయంలో కొంతమంది విజయ్ దేవరకొండను లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేశారు. వాళ్లకి తనదైన శైలిలో విజయ్ దేవరకొండ సమాధానమిచ్చాడు కూడా.
తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "ఎన్టీఆర్ వంటి పెద్ద హీరో చేసిన సినిమా రావడానికి ఒక వారం ముందుగా 'నోటా' రానుండటం తమకి నష్టాన్ని కలిగించే విషయమేనని అన్నాడు. ఈ విషయంలో వెనక్కి తగ్గవలసింది తామేనని చెప్పాడు. అయితే ఫలానా రోజున మీ సినిమా రిలీజ్ చేయవద్దని ఎవరైనా అంటే మాత్రం తాను వినననీ, అలా అనే హక్కు ఎవరికీ లేదని అన్నాడు. బడ్జెట్ పరంగా .. బిజినెస్ పరంగా తన సినిమాకి పది రెట్ల స్థాయిలో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని చెప్పాడు. అలాంటప్పుడు ఎన్టీఆర్ సినిమాకి పోటీగా నా సినిమా వస్తోందనడంలో అర్థం లేదు" అని ఆయన స్పష్టం చేశాడు.