Nana Patekar: నానా పటేకర్ దుర్మార్గుడే... చెడు కోణం ఉంది: డింపుల్ కపాడియా

  • లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న నానా పటేకర్
  • గొప్ప నటుడే అయినా, చీకటి కోణం ఉందన్న డింపుల్
  • ఎంతో మంది బాధపడ్డారని వ్యాఖ్యానించిన రేణుకా సహానే
నటి తనుశ్రీ దత్తాను ఓ సినిమా షూటింగ్ సమయంలో లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు నానా పటేకర్ పై, సీనియర్ నటి డింపుల్ కపాడియా చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. తనకు తెలిసినంత వరకూ నానా పటేకర్ దుర్మార్గుడేనని, అతనిలో గొప్ప నటుడు ఉన్నప్పటికీ, చీకటి కోణం కూడా ఉందని ఓ ఇంటర్వ్యూలో డింపుల్ వెల్లడించారు.

అతనిలోని నటనా కౌశలం అత్యుద్భుతమని, అతని ప్రతిభను చూస్తే, వంద హత్యలు చేసినా క్షమించి వదిలేయాలని అనిపిస్తుందని కూడా డింపుల్ చెప్పుకొచ్చారు. ఇతర నటీనటులతో స్నేహంగా ఉండే ఆయనలో చెడు కూడా ఉందని చెప్పారు. కాగా, నానా స్థిరత్వం లేని వ్యక్తని, అతని కారణంగా బాలీవుడ్ లో ఎంతో మంది బాధపడ్డారని ఇటీవల మరో నటి రేణుకా సహానే విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
Nana Patekar
Dimple Kapadia
Renuka Sahane
Tanusri Dutta

More Telugu News