vijay devarakonda: త్రిభాషా చిత్రంలో విజయ్ దేవరకొండ!

  • ఈ నెల 5వ తేదీన రానున్న 'నోటా' 
  • వచ్చే ఏడాది రెడీ కానున్న 'డియర్ కామ్రేడ్'
  • తమిళ నిర్మాతతో భారీ చిత్రం

విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'నోటా' రెడీ అవుతోంది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా ఈ నెల 5వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది. ఈ సినిమా తరువాత ఆయన నుంచి వచ్చే ఏడాది 'డియర్ కామ్రేడ్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన మరో తమిళ బ్యానర్లో సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా సమాచారం.

తమిళ నిర్మాత ఎస్.ఆర్. ప్రభు నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా రూపొందనుందని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ కూడా విజయ్ దేవరకొండకి ముట్టినట్టుగా చెబుతున్నారు. తమిళ .. తెలుగు భాషలతో పాటు మలయాళంలోను ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. మొత్తానికి విజయ్ దేవరకొండ మూడు భాషల్లో మార్కెట్ పెంచుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. 

More Telugu News