చంద్రబాబును గద్దెదించాలన్నది పవన్ కుట్ర: నటుడు శివాజీ ఆరోపణ
- అభివృద్ధిని అడ్డుకుంటున్న కొందరు నేతలు
- రాజకీయాల స్థానంలో కుతంత్రాలు వచ్చి చేరాయి
- తిరుమలలో నటుడు శివాజీ
ఏపీకి ప్రత్యేక హోదా రావాలని స్వామివారిని కోరుకున్నానని చెప్పిన శివాజీ, ఏపీ అభివృద్ధిని కొంతమంది నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఏపీలో ప్రస్తుతం నడుస్తున్నది రాజకీయాలు కాదని, కుతంత్రాలని అభిప్రాయపడ్డ ఆయన, ప్రజలు అభివృద్ధి వెంటే ఉంటారన్న నిజం ఎన్నికల తరువాత నిరూపితం అవుతుందని అన్నారు.