sudeep: ప్రమాదంలో కన్నడ నటుడు సుదీప్ కు గాయాలు.. కోలుకోవాలని అభిమానుల పూజలు!

  • పైల్వాన్ షూటింగ్ సందర్భంగా ఘటన
  • కారు నడుపుతుండగా ప్రమాదం
  • కోలుకుంటున్న స్టార్ హీరో

బహుభాషా నటుడు, హీరో సుదీప్ గాయపడ్డాడు. ప్రస్తుతం కన్నడలో తెరకెక్కుతున్న ‘పైల్వాన్’ చిత్రంలో సుదీప్ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా కారు ప్రమాదం జరిగినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ ప్రమాదంలో సుదీప్ కు స్వల్ప గాయాలు అయ్యాయనీ, ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించింది.

కాగా, ప్రమాదం నేపథ్యంలో ఇటీవల జరిగిన ‘విలన్’ సినిమా టీజర్ విడుదలకు సుదీప్ గైర్హాజరయ్యారు. తాను గాయపడ్డందున ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నట్లు సుదీప్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో సుదీప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమానులు పలు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు.

More Telugu News