MVVS Murthy: ప్రమాద సమయంలో 140 కి.మీ. స్పీడ్ తో వెళుతున్న 'గీతం' మూర్తి కారు!

  • ఎదురుగా వస్తున్న ఫోర్డ్ ట్రక్ ను ఢీకొన్న మూర్తి కారు
  • ఘోర ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం
  • తీవ్రంగా గాయపడిన కడియాల వెంకటరత్నం పరిస్థితి విషమం
ఈ నెల ఆరవ తేదీన అమెరికా పరిధిలోని కాలిఫోర్నియాలో గీతం యూనివర్శిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు వెళ్లిన విద్యాదాత, ఎమ్మెల్సీ మతుకుమిల్లి వీర వెంకట సత్యనారాయణ మూర్తి (ఎంవీవీఎస్ మూర్తి) అలస్కాలో ఘోర ప్రమాదానికి గురై మరణించిన సంగతి తెలిసిందే. ఓ వైల్డ్ లైఫ్ పార్కును సందర్శించేందుకు ఆయన మరో నలుగురితో కలసి వాహనంలో ప్రయాణిస్తున్న వేళ, ఎదురుగా వస్తన్న ఫోర్డ్ ట్రక్ బలంగా ఢీకొట్టింది. అతివేగమే ప్రమాదానికి కారణమని అలస్కా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం.

 ప్రమాదం జరిగిన సమయంలో మూర్తి బృందం ప్రయాణిస్తున్న కారు గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళుతున్నట్టు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాదం జరుగగా, అక్కడికక్కడే ఇద్దరు, ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మరణించారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఐదో వ్యక్తి కడియాల వెంకట రత్నాన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
MVVS Murthy
Car
USA
Road Accident
Alaska

More Telugu News