vote for note: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టార్చర్ పెడుతున్నాయి: ఓటుకు నోటు కేసు నిందితుడు జెరూసలెం మత్తయ్య

  • క్రిస్టియన్ అయిన నన్ను మానసిక క్షోభకు గురి చేస్తున్నాయి
  • ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు
  • అసలైన నేరస్తులను గుర్తించి, కేసును కొట్టి వేయలి

ఓటుకు నోటు కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేసులో నిందితుడు జెరూసలెం మత్తయ్య అన్నారు. కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ స్వలాభం కోసం తనను టార్చర్ పెడుతున్నాయని తెలిపారు. క్రిస్టియన్ అయిన తనను దర్యాప్తు పేరుతో మానసిక క్షోభకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

దర్యాప్తును ఇప్పటికైనా ముమ్మరం చేయాలని, అసలు నేరస్తులకు శిక్షను విధించి కేసును కొట్టి వేయాలని కోరారు. తాజాగా ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ నివాసాల్లో ఐటీ సోదాలు జరిగాయి.

  • Loading...

More Telugu News