nota: 'నోటా' సినిమాపై కాంగ్రెస్ నేత పొంగులేటి ఆందోళన

  • ఈ సినిమా ప్రేరణతో ఓటర్లు నోటా మీటను నొక్కే అవకాశం ఉంది
  • ఎన్నికల కమిషన్ ఈ చిత్రాన్ని వీక్షించాలి
  • అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే తొలగించాలి

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'నోటా' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఈ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. 'నోటా' సినిమా ప్రేరణతో ఓటర్లు ఈవీఎంపై ఉండే నోటా మీటను నొక్కే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సినిమాను కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం, సెన్సార్ బోర్డు సభ్యులు పరిశీలించాలని... సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే తొలగించాలని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమాపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. 

More Telugu News