Anantapur District: జేసీ ఎఫెక్ట్... తాడిపత్రి డీఎస్పీ సస్పెన్షన్!

  • వినాయక నిమజ్జనం సందర్భంగా ఉద్రిక్తత
  • ప్రబోధానంద అనుచరులతో జేసీ వర్గీయుల ఘర్షణ
  • శాంతి భద్రతల నిర్వహణలో డీఎస్పీ వైఫల్యం
  • నివేదిక వచ్చిన తరువాత సస్పెండ్ చేసిన డీజీపీ

గత నెల వినాయకచవితి అనంతరం నిమజ్జనం సందర్భంగా చెలరేగిన ఘర్షణలను ముందుగా పసిగట్టడంలో విఫలం కావడం, ఘర్షణల తరువాత శాంతిభద్రతల నిర్వహణలో వైఫల్యం చెందారన్న ఉన్నతాధికారుల నివేదిక ఆధారంగా తాడిపత్రి డీఎస్పీ బీ విజయ్ కుమార్ ను సస్పెండ్ చేస్తున్నట్టు డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఉత్తర్వులు వెలువరించారు.

నిమజ్జనం సందర్భంగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనుచరులు, ప్రబోధానంద ఆశ్రమ భక్తులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు జరగగా, ఒకరు చనిపోయిన సంగతి తెలిసిందే. తీవ్ర ఉద్రిక్తతలకు కారణం పోలీసుల వైఫల్యమేనని, ఈ విషయంలో విజయ్ కుమార్ సరిగ్గా స్పందించలేదని జేసీ విమర్శలు చేశారు. పరోక్షంగా ఆయన్ను హిజ్రాలతో పోలుస్తూ జేసీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి కూడా. ఈ వ్యవహారంలో కింది స్థాయి పోలీసులపై ఇప్పటికే చర్యలు తీసుకున్న ప్రభుత్వం, ఇప్పుడు డీఎస్పీని సైతం విధుల నుంచి తప్పించడం గమనార్హం.

  • Loading...

More Telugu News