Pawan Kalyan: నీ వ్యక్తిత్వంలో లక్షో వంతు అయినా వీరికివ్వు మహాత్మా!: పవన్ కల్యాణ్

  • గాంధీ జీవిత విలువల్లో ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవాలి
  • ఆ మహాత్ముడికి నివాళులర్పిస్తున్నా
  • మహాత్ముడి ఆశయాల ప్రభావం మా సిద్ధాంతాలపై ఉంది

గాంధీ మహాత్ముని జీవితం... పాటించిన విలువలు, నమ్మిన సిద్ధాంతాలు.. ఈ దేశంలో మరొకరిలో మనం గమనించలేమని, గాంధీజీ జీవిత విలువల్లోని ఔన్నత్యాన్ని అర్థం చేసుకొనేందుకు అందరం ప్రయత్నించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆ మహాత్మునికి నివాళులు అర్పిస్తున్నానని ఓ ప్రకటనలో తెలిపారు.

మహాత్ముని ఆశయాల ప్రభావం జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాలపై ఉందని అన్నారు. అవినీతిపై రాజీలేని పోరాటం, కులాలను కలిపే ఆలోచన, మత ప్రస్తావన లేకుండా రాజకీయం వర్తమాన సమాజానికి ఇవ్వాలన్న సిద్ధాంతాలు గాంధేయ విధానాలను వెల్లడిస్తాయని అన్నారు. రాజకీయాలంటే సేవ అనే భావన విడిచిపెట్టి, కోట్ల వ్యాపారంగా నేటి నాయకులు మార్చేశారని విమర్శించారు. అవినీతి, దౌర్జన్యాలతో వర్గపోరు సృష్టించి ఎదగాలనుకొంటున్నారని, ఇలాంటి నాయకులను చూస్తుంటే.. 'నీ వ్యక్తిత్వంలో లక్షో వంతు అయినా వీరికి ఇవ్వు మహాత్మా' అని వేడుకోవాలని అని పిస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు.

  • Loading...

More Telugu News