taman: విమర్శల వలన నాకు పోయేదేమీలేదు: సంగీత దర్శకుడు తమన్
- 'అరవింద సమేత' పాటలపై కామెంట్స్
- అసహనానికి లోనైన తమన్
- దర్శక నిర్మాతలు నన్ను నమ్ముతున్నారు
తెలుగులో వరుస సినిమాలకి బాణీలను సమకూరుస్తూ, ఎప్పటికప్పుడు తనదైన ప్రత్యేకతను తమన్ చాటుకుంటున్నారు. ఒక పాట వినగానే ఇది తమన్ స్వరపరిచిందని చెప్పేయవచ్చు. అంతగా ఆ పాటలపై ఆయన మార్కు స్పష్టంగా కన్పిస్తుంది. అలాంటి తమన్ తాజాగా 'అరవింద సమేత' సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఇటీవలే ఈ పాటలు నేరుగా మార్కెట్లోకి విడుదలయ్యాయి.
అయితే గతంలో తమన్ చేసిన కొన్ని పాటలకి ఈ ట్యూన్స్ దగ్గరగా వున్నాయనే విమర్శలు వచ్చాయి. కాపీ చేశాడంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దాంతో తమన్ స్పందిస్తూ .. "నా పాటలను మళ్లీ నేనే వాడుకుంటే అది కాపీ ఎలా అవుతుంది?" అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. బాణీలు కట్టడంలో ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది .. నా స్టైల్ నాది. కావాలని విమర్శించేవాళ్లకు సమాధానాలు చెబుతూ నా పనిని నేను పాడుచేసుకోలేను. దర్శక నిర్మాతలు .. హీరోలు నన్ను నమ్ముతున్నప్పుడు మిగతావాళ్లు విమర్శించడం వలన నాకు పోయేదేమీ లేదు"అంటూ తేల్చి చెప్పేశారు.