jagityal: ఆ తెలుగు సినిమా స్ఫూర్తితోనే వీళ్లిద్దరూ చనిపోయారు: డీఎస్పీ వెంకటరమణ

  • 'ఆర్ఎక్స్ 100' సినిమా ప్రభావంతోనే ఘటన
  • ఇవి హత్యలు కాదు.. ఆత్మహత్యలు
  • మరింత లోతుగా కేసును దర్యాప్తు చేస్తున్నాం
జగిత్యాలకు చెందిన మహేందర్, రవితేజలు ఒకే అమ్మాయిని ప్రేమించి, గొడవపడి, నిప్పంటించుకుని, చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన డీఎస్పీ వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల విడుదలైన 'ఆర్ఎక్స్ 100' సినిమా స్ఫూర్తితోనే వీరిద్దరూ చనిపోయారని చెప్పారు. వారివి హత్యలు కాదని, ఆత్మహత్యలని చెప్పారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని... వాట్సాప్ చాటింగ్, కాల్ డేటాను సేకరిస్తున్నామని తెలిపారు.

కాగా, వీరిద్దరూ ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమిస్తుండటంతో ఈ విషయంలో తరచూ గొడవ పడుతుండేవారు. నిన్న మరో స్నేహితుడితో కలసి పట్టణంలోని మిషన్ కాంపౌండ్ లో మద్యం సేవించి... తాగిన మైకంలో ఇద్దరూ గొడవపడ్డారు. వివాదం ముదరడంతో ఇద్దరూ ఒకరిపై మరొకరు పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో మహేందర్ అక్కడికక్కడే మృతి చెందగా, కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రవితేజ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
jagityal
lovers
suicide
dsp

More Telugu News