stock market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 299 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

  • నష్టాలతో ప్రారంభమై లాభాల్లో ముగిసిన మార్కెట్లు
  • బ్యాంకింగ్, ఆటో, మెటల్స్ రంగాల్లో కొనసాగిన జోరు
  • 22 పైసలు నష్టపోయిన రూపాయి

ఈ రోజు నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు చివరికి లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) ఈ రోజు 90 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 10,900 పాయింట్ల దిగువన ట్రేడింగ్ ప్రారంభించాయి. ఓవైపు డాలర్ తో రూపాయి విలువ క్షీణించడం, ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో మదుపర్లు షేర్ల అమ్మకాలకు దిగారు.

దీంతో బ్యాంకింగ్, ఆటోమొబైల్, లోహాల షేర్ల అమ్మకాల జోరు కొనసాగింది. ట్రేడింగ్ ముగిసేటప్పటికి కోటక్‌ మహీంద్రా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతి సుజుకీ తదితర షేర్లు ఈ రోజు నష్టపోగా, యెస్ బ్యాంక్ షేర్లు స్వల్ప లాభాలు నమోదు చేశాయి. దీంతో ట్రేడింగ్ ముగిసేనాటికి బీఎస్ఈ 299 పాయింట్ల లాభంతో 36,524 వద్దకు చేరుకోగా, నిఫ్టీ 78 పాయింట్ల లాభంతో 11,008కి చేరుకుంది. ఇక డాలర్‌తో రూపాయి మారకం విలువ 22 పైసలు నష్టపోయి రూ. 72.70 వద్ద కొనసాగుతోంది.

నేడు ట్రేడింగ్ సందర్భంగా ఇన్ఫీబీమ్‌ 16 శాతం దూసుకెళ్లగా, నిట్‌ టెక్‌, మైండ్‌ ట్రీ, టీసీఎస్‌, ఒరాకిల్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ లాభపడ్డాయి. వీటితో పాటు యస్‌ బ్యాంక్‌, హిందాల్కో, ఐబీ హౌసింగ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్‌ఫ్రా టెల్‌, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ కూడా లాభాలు నమోదు చేశాయి.

ఇక రియల్టీ కంపెనీలు అయిన యూనిటెక్‌, ఇండియా బుల్స్‌, సన్‌ టెక్‌, డీఎల్‌ఎఫ్‌, ఫీనిక్స్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, శోభా, బ్రిగేడ్‌ షేర్లు 6 నుంచి 12  శాతం మధ్య పతనమయ్యాయి. ఇంకా హెచ్‌పీసీఎల్‌, అల్ట్రాటెక్‌, ఇండస్‌ఇండ్, భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, గ్రాసిమ్‌, బీపీసీఎల్‌ కూడా ప్రతికూల ఫలితాలను నమోదు చేశాయి.

More Telugu News