Mumbai: స్మార్ట్ గా దొంగతనం చేసిన కి'లేడీ'... వీడియో చూసి వేట ప్రారంభించిన పోలీసులు!

  • ముంబైలోని ములుంద్ లో ఘటన
  • సెల్ ఫోన్ కస్టమర్లలా షాపులోకి ప్రవేశించిన ఇద్దరమ్మాయిలు
  • నటిస్తూ, ఫోన్ కొట్టేసిన యువతి

ఓ సెల్ ఫోన్ల దుకాణంలోకి ప్రవేశించిన ఇద్దరు యువతుల్లో ఒకామె, స్మార్ట్ గా ఫోన్ ను దొంగిలించి, తన హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుంది. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డుకాగా, ఈ కిలేడీలను గుర్తించేందుకు పోలీసులు వేట ప్రారంభించారు. ముంబైలోని ములుంద్ ప్రాంతంలో నిత్యమూ రద్దీగా ఉండే సెల్ ఫోన్ దుకాణంలో ఈ ఘటన జరిగింది.

 ఇద్దరు యువతులు షాప్ లోకి వచ్చారు. వారిలో ఒకరు సెల్ ఫోన్ కొనుగోలు చేస్తున్నట్టుగా నటిస్తుండగా, మరో యువతి అటూ ఇటూ చూస్తూ, పక్కనే ఉన్న ఓ ఫోన్ ను చేతిలోకి తీసుకుని తన హ్యాండ్ బ్యాగులో వేసుకుంది. ఆపై ఫోన్ నచ్చలేదన్నట్టు చెబుతూ, వారిద్దరూ బయటకు జారుకున్నారు. ఆ తరువాత ఫోన్ పోయిన విషయాన్ని గుర్తించిన దుకాణం యజమాని పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదైంది.

More Telugu News