Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో మహాత్మునికి అవమానం.. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు!

  • విశాఖజిల్లా మధురవాడలో ఘటన
  • విగ్రహం చేతిని, కాళ్లను ధ్వంసం చేసిన ఆకతాయిలు
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు
భారత జాతిపిత, స్వాతంత్ర్య పోరాటాన్ని ఒంటి చేత్తో నడిపించిన మహాత్మా గాంధీ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. గుర్తుతెలియని ఆకతాయిలు కొందరు బాపూ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గాంధీ జయంతికి ఒక్కరోజు ముందు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం మధురవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు గాంధీ విగ్రహం చేతిని, కాళ్లను ధ్వంసం చేశారు. దీంతో దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh
mahatma gandhi
Visakhapatnam District
madhurawada
statue
damaged
Police

More Telugu News