కొండా దంపతులు వెళ్లిపోవడంతో పీడ విరగడైంది!: కడియం శ్రీహరి
- వరంగల్ తూర్పులో గెలవలేకే.. పరకాలకు పారిపోయారు
- ఈ నియోజవర్గానికి పట్టిన పీడ విరగడై పోయింది
- కేసీఆర్, కేటీఆర్ లపై అవాకులు చవాకులు పేలారు
గత ఆరు నెలలుగా కొండా దంపతుల తీరును ముఖ్యమంత్రి కేసీఆర్ గమనించారని... అందుకే అభ్యర్థుల తొలి జాబితాలో వారి పేరును ప్రకటించలేదని శ్రీహరి అన్నారు. కేసీఆర్, కేటీఆర్ లపై అవాకులు చవాకులు పేలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతుల ప్రభావం ఏమీ లేదని.... మొత్తం 21 మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పారు.