balakrishna: 'ఎన్టీఆర్' కోసం చైతన్య రథయాత్రకి సన్నాహాలు

  • షూటింగు దశలో 'ఎన్టీఆర్'
  • 3 షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తి 
  • 4వ తేదీ నుంచి 4వ షెడ్యూల్ 

క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ కి సంబంధించిన చిత్రీకరణ చకచకా జరిగిపోతోంది. ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. మొదటి షెడ్యూల్లో బాలకృష్ణ - విద్యాబాలన్, మిగతా రెండు షెడ్యూల్స్ లో బాలకృష్ణ - రానా .. బాలకృష్ణ - సుమంత్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించారు. నాల్గొవ షెడ్యూల్ ను ఈ నెల 4వ తేదీ నుంచి మొదలు పెట్టనున్నారు.

'చైతన్యరథయాత్ర'కి సంబంధించిన నేపథ్యంలో షూటింగు కొనసాగుతుంది. శ్రీకాకుళం .. విజయనగరం .. విశాఖ .. అన్నవరం .. గుంటూరు జిల్లాల్లో ఈ రథయాత్రను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్లో హరికృష్ణ పాత్రను కల్యాణ్ రామ్ పోషించనున్నాడు. ఈ షెడ్యూల్ చిత్రీకరణతో ఈ సినిమా 50 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకున్నట్టు అవుతుంది. నందమూరి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు.   

  • Loading...

More Telugu News