Biggboss: ఈ గెలుపు కౌశల్ ది కాదు... బిగ్ బాస్ పై రచయిత కోన వెంకట్ స్పందన!

  • నిన్నటితో ముగిసిన బిగ్ బాస్-2
  • విజేతగా నిలిచిన కౌశల్
  • కౌశల్ కు మద్దతిచ్చిన అభిమానులదే గెలుపు 
  • ట్విట్టర్ లో కోన వెంకట్
113 రోజుల పాటు తెలుగు టీవీ ప్రేక్షకులను అలరించిన 'బిగ్‌ బాస్ - సీజన్ 2' నిన్నటితో ముగిసింది. ఫైనలిస్టులుగా సింగర్ గీతా మాధురి, మోడల్, యాక్టర్ కౌశల్ నిలువగా, కౌశల్‌ విజేతగా నిలిచాడు. కౌశల్ గెలుపుపై స్పందించిన రచయిత కోన వెంకట్, ఇది కౌశల్ గెలుపు కాదని, కులమతాలకు అతీతంగా కౌశల్ వెంట నిలిచి మద్దతు పలికిన అభిమానులదని ఆయన అన్నాడు.

 ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేస్తూ, నిజాయితీకి ప్రజలిచ్చిన స్పందనకు కౌశల్ గెలుపు ఓ మంచి ఉదాహరణని అభివర్ణించాడు. నిజాయతీ కలిగుంటే, ప్రజలు మద్దతిస్తారన్న విషయం మరోసారి నిరూపితమైందని, ఇంతటి ప్రజాభిమానానికి కౌశల్ అర్హుడేనని చెప్పాడు. బిగ్‌బాస్ - 2 గెలుపు కౌశల్ ఆర్మీదేనని పేర్కొన్నాడు. ఇక కౌన వెంకట్ ట్వీట్ ను చూసిన ఫ్యాన్స్, కౌశల్‌ తో ఓ సినిమా ప్లాన్ చేసుకోవాలని కోరుతుండటం గమనార్హం.
Biggboss
Koushal
Kona Venkat
Koushal Army

More Telugu News