srireddy: శ్రీరెడ్డికి నీతులు చెప్పిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు తనెందుకు పాటించడం లేదు?: కత్తి మహేశ్

  • ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పడం హాస్యాస్పదం
  • రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేస్తా
  • దళితులకు రాజ్యాధికారం దక్కాలి
తన ప్రాణాలకు ముప్పు ఉందనీ, హత్యకు కొందరు కుట్ర పన్నుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పడాన్ని ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ఖండించారు. పవన్ కల్యాణ్ రాజకీయ పరిణతి లేకుండా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. దళితులకు రాజ్యాధికారం దక్కాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రోజు ఒంగోలులో జరిగిన ఓ సమావేశంలో కత్తి మహేశ్ మాట్లాడారు.

క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో పోలీసులను ఆశ్రయించాలని శ్రీరెడ్డికి సూచించిన పవన్ ఇప్పుడు అదే పనిని తాను ఎందుకు చేయడం లేదని మహేశ్ ప్రశ్నించారు. నిజంగా ప్రాణ హాని ఉంటే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. పవన్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ పరిణతిని తెలియజేస్తున్నాయని విమర్శించారు. దళితుల్లో కొత్త నాయకత్వం తెచ్చేందుకు తాను ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటిస్తున్నానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీ గా పోటీ చేస్తానని ప్రకటించారు.
srireddy
Kathi Mahesh
Pawan Kalyan
casting cough
Tollywood
mp
dalits
Andhra Pradesh

More Telugu News