Jammu And Kashmir: మరోసారి నిబంధనల ఉల్లంఘన.. భారత గగనతలంలోకి పాక్ హెలికాప్టర్!

  • గుల్పర్ ప్రాంతంలో పాక్ హెలికాప్టర్ 
  • ఈరోజు మధ్యాహ్నం అక్రమంగా ప్రవేశించింది
  • జవాన్ల కాల్పులతో వెనుదిరిగిన వైనం 
పాకిస్థాన్ మరోసారి నిబంధనలను ఉల్లంఘించింది. భారత గగనతలంలో పాక్ హెలికాఫ్టర్ చక్కర్లు కొట్టింది. ఈరోజు మధ్యాహ్నం జమ్ముకశ్మీర్ లోని పూంఛ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నియంత్రణ రేఖను దాటి కృష్ణ ఘటి సెక్టార్ లోని గుల్పర్ ప్రాంతంలో మధ్యాహ్నం 12.13 గంటలకు పాకిస్థాన్ హెలికాఫ్టర్ అక్రమంగా ప్రవేశించినట్టు భారత రక్షణ శాఖ అధికారులు ధ్రువీకరించారు. అప్రమత్తమైన భారత జవాన్లు కాల్పులు జరపడంతో.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) వైపు ఆ హెలికాఫ్టర్ వెళ్లిపోయిందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.
Jammu And Kashmir
india
Pakistan

More Telugu News