Serena Williams: టాప్ లెస్ గా సాంగ్ పాడి సంచలనం రేపిన సెరీనా విలియమ్స్!

  • ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్
  • మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవాలి
  • క్రమానుసారం పరీక్షలు చేయించుకోవాలని సెరీనా సూచన
టెన్నిస్ సూపర్ స్టార్ సెరీనా విలియన్స్, ఇప్పుడు నెట్టింట సంచలనాన్నే రేపింది. ఈ ఉదయం ఆమె టాప్ లెస్ గా ఓ పాటను పాడి, ఆ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అప్ లోడ్ చేసింది. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన తెచ్చేందుకు 'ఐ టచ్ మైసెల్ఫ్' అంటూ సాగే పాటను పాడింది.

చేతులతో తన హృదయాన్ని కవర్ చేసుకున్న ఆమె, 1991లో ఆస్ట్రేలియన్ బ్యాండ్ ఆలపించిన పాటను పాడింది. మహిళలు తమ ఆరోగ్యంపై, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ పై దృష్టిని సారిస్తూ, క్రమానుసారం పరీక్షలు చేయించుకోవాలని కోరుకుంటున్నట్టు ఈ సందర్భంగా ఆమె తెలిపింది. మహిళల్లో ఇది పెను సమస్యగా మారిందని, సాధ్యమైనంత త్వరలో వ్యాధి నిర్దారణ జరిగితేనే ప్రాణాలు మిగులుతాయని వెల్లడించింది. కాగా, ఈ పాటను డివినిల్స్, క్రిస్సీ ఆమ్ ఫ్లెట్లు కలసి రాశారు. వీరిరువురూ బ్రెస్ట్ క్యాన్సర్ కారణంగా మరణించిన వారే.
Serena Williams
Breast Cancdr
Topless

More Telugu News