చిచ్చుపెట్టిన సెల్ ఫోన్ చాటింగ్.. మహిళ ఆత్మహత్య!
- హైదరాబాద్ పరిధిలో ఘటన
- వివాహిత సెల్ ఫోన్ అసభ్యకర సందేశాలు
- ఫోన్ మార్చిన తరువాత యువతికి కష్టాలు
- మనస్తాపంతో ఆత్మహత్య
శ్వేత సెల్ ఫోన్ నంబరును సేకరించిన సాయితేజ అనే యువకుడు, పరిచయం పెంచుకుని, ఆపై అసభ్యకర సందేశాలు ఇవ్వడం మొదలు పెట్టాడు. అతని మెసేజ్ లు హద్దులు మీరుతుండటంతో, తన ఫోన్ పోయిందని కుటుంబీకులకు తెలిపిన శ్వేత, ఆ ఫోన్ నంబరును వరుసకు బావయ్యే శ్రీకాంత్ అనే యువకుడికి ఇచ్చింది. శ్రీకాంత్ అందులోని మెసేజ్ లను చూసి, ఆగ్రహంతో, సాయితేజను పిలిపించి దాడిచేశాడు.
ఈ విషయమై సాయితేజ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. శ్రీకాంత్ కు రూ.10 వేల జరిమానా విధించడంతో, దాన్ని చెల్లించి బయటకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న శ్వేత, తన కారణంగా బావకు జరిమానా పడిందన్న మనస్తాపంతో, సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్యహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.