Kidari: పట్టించింది దగ్గరి అనుచరులే... పోలీసుల అదుపులో ఇద్దరు కిడారి సన్నిహితులు!

  • మావోలకు సమాచారం ఇచ్చింది వారే
  • కాల్ డేటా ఆధారంగా గుర్తించిన పోలీసులు
  • హత్య తరువాత కూడా మావోలకు కాల్స్

సరిగ్గా వారం రోజుల క్రితం, అరకు అసెంబ్లీ నియోజక పరిధిలోని లివిటిపుట్టు ప్రాంతంలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేశారు. ఈ కేసు విచారణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు, ఇప్పటికే పలు కీలక విషయాలను వెలుగులోకి తెచ్చారు.

వారిని కాల్చిన వారి వివరాల నుంచి, వ్యూహరచన చేసిన వారు, కిడారి పర్యటన గురించి మావోలకు ఉప్పందించిన వారి వరకూ కూపీ లాగారు. కిడారి పర్యటన గురించి మావోయిస్టులకు ముందస్తు సమాచారం అందించింది ఆయనకు అత్యంత సన్నిహితులైన అనుచరులేనని అనుమానిస్తూ ఇద్దరిని అరెస్ట్ చేయడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. కిడారి కదలికలను ఎప్పటికప్పుడు మావోలకు చేరవేసింది వారేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

వారి కాల్ డేటా ఆధారంగా ఓ నిర్ధారణకు వచ్చిన పోలీసులు, కిడారి, సోమల హత్య తరువాత, వారిరువురూ, అక్కడే రెండు రోజుల పాటు ఉన్నారని కూడా వీరి ఫోన్ కాల్స్ ద్వారా తేలినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

More Telugu News