jagan: జగన్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు ఆ జీవోను నిలిపేశారు: పార్థసారధి

  • ఎమ్యెల్యే, మాజీ ఎమ్మెల్యే ప్రాణాలను కూడా కాపాడలేక పోయారు
  • మైనింగ్ చట్టాలను మార్చింది చంద్రబాబు కాదా?
  • తవ్వకాల కోసం జీవో 97ను తెచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధికార ప్రతినిధి పార్థసారథి విమర్శలు గుప్పించారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను కాపాడలేని చంద్రబాబు ప్రభుత్వం... తమపై బురద చల్లేందుకు యత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. విదేశాలకు వెళ్లి వచ్చిన ఉత్సాహంలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.

దోచుకునేందుకు మైనింగ్ చట్టాలను మార్చింది చంద్రబాబు కాదా? అని పార్థసారథి ప్రశ్నించారు. 2014లో ముఖ్యమంత్రి కాగానే బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాశారని అన్నారు. తవ్వకాల కోసం జీవో 97ను తీసుకొచ్చింది చంద్రబాబు ప్రభుత్వమేనని చెప్పారు. విశాఖ ఏజెన్సీలో నిర్వహించిన సభలో జగన్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత బాక్సైట్ మైనింగ్ జీవోను నిలిపివేశారని తెలిపారు. ఓటుకు నోటు కేసుపై చంద్రబాబు నోరు విప్పాలని డిమాండ్ చేశారు. ప్రకృతి సేద్యం అంటే ఏమిటో ఒకసారి చంద్రబాబు వివరించాలని కోరారు. 

  • Loading...

More Telugu News