babu mohan: అక్కడ పనికిరానని పక్కన పెట్టారు... ఇక్కడ పనికొస్తానేమోనని వచ్చా: బీజేపీలో చేరిన సందర్భంగా బాబూమోహన్

  • అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన బాబూమోహన్
  • సాదరంగా ఆహ్వానించిన అమిత్ షా
  • ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్న బాబూమోహన్
టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ ఈరోజు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తో కలసి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బాబూమోహన్ కు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆందోల్ టికెట్ ను బాబూమోహన్ కు బీజేపీ కేటాయించినట్టు సమాచారం.

ఈ సందర్భంగా బాబూమోహన్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ లో పనికిరానని తనను పక్కన పెట్టేశారని... ఇక్కడైనా పనికొస్తానేమోనని వచ్చానని చమత్కరించారు. ప్రజాసేవ చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.

105 మంది అభ్యర్థులతో కూడిన టీఆర్ఎస్ తొలి జాబితాలో ఆందోల్ తాజా ఎమ్మెల్యే బాబూమోహన్ పేరును కేసీఆర్ పక్కనపెట్టారు. ఆయన స్థానంలో జర్నలిస్టు క్రాంతి కిరణ్ కు టికెట్ ను కేటాయించారు. దీంతో, బాబూమోహన్ మనస్తాపానికి గురయ్యారు.
babu mohan
amith shah
lakshman
bjp
TRS
andhol

More Telugu News