paruchuri: ఈ ఒక్క సీన్ తో బాలకృష్ణ పాత్ర మరొకసారి పైకి లేచింది: పరుచూరి గోపాలకృష్ణ

షార్ట్స్‌లో చూడండి
తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 'సమరసింహా రెడ్డి' సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. " ఈ సినిమాలో బాలకృష్ణ చెల్లెలు కాళ్లలో సత్తువలేని కారణంగా నడవలేక ఇబ్బంది పడుతుంటుంది. ఇక తాను ఎప్పటికీ నడవలేనని ఆమె మానసికంగా కుంగిపోతూ ఉంటుంది. ఆత్మహత్య చేసుకోవడానికి రైలు పట్టాలపైకి వెళుతుంది.

ఆమెను వెతుక్కుంటూ బాలకృష్ణ అక్కడికి చేరుకుంటాడు. చెల్లెలికి నడక తెప్పించాలనే ఉద్దేశంతో, రెండు ట్రాక్ ల మధ్యలో హీరో కాలు పెడతాడు. త్వరగా వచ్చి కాపాడకపోతే రైలు తనని గుద్దేస్తుందంటూ చెల్లెలిని తొందర చేస్తాడు. దాంతో ఆమె తాను నడవలేను అనే విషయాన్ని మరిచిపోయి పరిగెత్తుకు వచ్చి అన్నను కాపాడుతుంది. ఒకవేళ ఆ అమ్మాయి పరిగెత్తుకు వచ్చి కాపాడకపోతే హీరో పాత్ర చనిపోతుంది. చెల్లెలికి కాళ్లు రప్పించడం కోసం హీరో ప్రాణాలకి తెగించి సాహసం చేయడంతో, ఆ పాత్ర మరోసారి పైకి లేచింది" అని చెప్పుకొచ్చారు. 
Go Back to Shorts
paruchuri

More Telugu News