paruchuri: 'సమరసింహా రెడ్డి'లోని ఆ సీన్ రజనీకి బాగా నచ్చిందట: పరుచూరి గోపాలకృష్ణ

  • కైకాల కోసం పోలీస్ ఆఫీసర్ పాత్ర అనుకున్నాము
  • విజయేంద్ర ప్రసాద్ ఆ మార్పుకి ఓకే అన్నారు 
  • నేను చెప్పిన లాజిక్ గోపాల్ కి నచ్చింది  

రచయితగా అనేక చిత్రాల విజయాలలో కీలకమైన పాత్రను పోషించిన పరుచూరి గోపాలకృష్ణ, తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో మాట్లాడుతూ 'సమరసింహా రెడ్డి' సినిమాను గురించి ప్రస్తావించారు. 'సమరసింహా రెడ్డి' కథను విజయేంద్ర ప్రసాద్ గారు రాయగా, నేను .. ఆయన .. దర్శకుడు బి.గోపాల్ మద్రాస్ లోని ఆంధ్రా క్లబ్ లో ఈ కథపై కూర్చున్నాము. ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ కోసం ఒక మంచి పాత్రను క్రియేట్ చేయమని గోపాల్ అడిగితే, ఆయన కోసం సీమ ప్రాంతానికి చెందిన పోలీస్ ఆఫీసర్ పాత్రను సృష్టించాను. అది విజయేంద్ర ప్రసాద్ గారికి కూడా బాగా నచ్చింది.

ఒకానొక సందర్భంలో ఈ పోలీస్ పాత్ర బాలకృష్ణ కనిపించగానే చేతులు జోడించి నమస్కరిస్తుంది. అలా చేస్తే బాలకృష్ణయే 'సమరసింహా రెడ్డి' అనే విషయం ఆడియన్స్ కి ముందే తెలిసిపోతుందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. థియేటర్ కి వచ్చే ప్రేక్షకులు బాలకృష్ణయే 'సమరసింహా రెడ్డి' అనుకునే వస్తారుగానీ .. బ్రహ్మానందం అనుకుని రారు అని నేను అన్నాను. ఆ పాయింట్ గోపాల్ కి నచ్చింది. ఈ సినిమాలో హీరోకి పోలీస్ ఆఫీసర్ నమస్కారం చేసే సీన్ రజనీకాంత్ గారికి బాగా నచ్చిందట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. 'ఆ ఒక్క సీన్ తో హీరో పాత్రను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టారు' అని ఆయన అన్నారు" అంటూ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News